Valentine

Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Tuesday, February 3, 2026

మరువలేని మన జ్ఞాపకాలు...












🎵

నీ వెనువెంటే వస్తున్నా

నీ నీడై ఉంటున్నా

నీ ఊహల పల్లకిలో

ఊరేగుతూ విహరిస్తున్నా

నీ వెనువెంటే వస్తున్నా

నీ నీడై ఉంటున్నా

నీ ఊహల పల్లకిలో

ఊరేగుతూ విహరిస్తున్నా

🎵

కనుపాపలు నీకోరకు

కులుకెత్తక వేచున్నాయి

కోరికలు హరివిల్లై

రంగులు వెదజల్లుతున్నాయి

మదిలో నిలిచిపోయెను

మరువలేని మన జ్ఞాపకాలు

ఎప్పటికీ కలవలేని

మన ఇరువురి జీవితాలు

కడతేరి పోయాయి

అందని తీరాలై…

కలలే మిగిలాయి

కన్నీటి గీతాలై…

Thursday, August 22, 2019

Raasaleela
























Radhe Radhe, krishna krishna...Gopiyon Sang
Naachenge raath bhar.... Peeke Bang 

Oh na Priyuraala....Priyurala

Cheddama Raasaleela... Raasaleela
Baagundi nee Muthyala Maala... oh Baala
Lets be full on Tequila... ee Velaa

Radhe Radhe, krishna krishna...Gopiyon Sang

Naachenge raath bhar.... Peeke Bang 

Chupultho vallavu... napai nee premajaala

Gundello  virahamtho... ragulutundi agnijwala
Neekosam vechivunnai... kallu rendu... kayalu kaachela
Natho step lo step veyyi...bhoomi baddhalayyela 

Radhe Radhe, krishna krishna...Gopiyon Sang

Naachenge raath bhar.... Peeke Bang 

Brundavanamantha telisindi... hum dononka premaleela

Ghataina kissutho... shuru karenge ... hamara shrungaara leela
Ika Siggenduku.... Nannallukupove... Oh priyurala
Aao milke rachayenge... Sarikottha Raasaleela

Radhe Radhe, krishna krishna...Gopiyon Sang

Naachenge raath bhar.... Peeke Bang 

Tuesday, May 20, 2014

Laptop – Palmtop



















La la la laptop – pa pa pa palmtop

Zee generation girls memu   
Hitech - Btech bamalu memu 
Chetilo eppudu laptop-palmtop
Internet lo vuntamu always nonstop

Why should guys have all the fun?
Ha ha ha ha ha…….          || La la la laptop ||     

Kshanallo boy friends tho chatting lu
Sometimes saradaga camming lu    
Day & night whatsapp lo messaging lu
Eppudaina A grade movies watching lu

Why should guys have all the fun?
Ha ha ha ha ha…….          || La la la laptop ||              

Insta, Facebook lo following lu
Myntra, Amazon lo shopping lu
Paltalk, Tinder lo dating lu
Voice calls lo nonstop flirting lu

Why should guys have all the fun
Ha ha ha ha ha…              || La la la laptop ||               

Chestam online banking lu
Mariyu cinema tickets booking lu
Ikapai no more queue lo waiting lu
Endukante we are Techno-Savvy lu

Why should guys have all the fun?
Ha ha ha ha ha…               || La la la laptop ||                 

       

Saturday, August 6, 2011

సైకో!!!





Oh yeah oh yeah
Oh ye oh ye oh ye

సైకో… సైకో…
నువ్వు ఓ పెద్ద సైకో

సైకో… సైకో…
నువ్వు ఓ ముదురు సైకో

పిచ్చి పిచ్చి పిల్లా
నీతో ఏగేది ఎల్లా

క్రేజి క్రేజి పిల్లా
ఇంత మొండిగుంటే ఎల్లా

(Rap Part)

గర్ల్ ఫ్రెండ్ గా వుండమంటే
కాదు పొమ్మంటావ్


మళ్లిమళ్లి నా వెంటే
తిరుగుతూ వుంటావ్


పెళ్లి గిళ్లి వద్దని
నువ్వే అంటావ్

నాపై ఎల్లపుడు
ఓ కంట పెట్టె వుంటావ్

సైకో... సైకో...

పిచ్చి పిచ్చి పిల్లా
నీతో ఏగేది ఎల్లా

క్రేజి క్రేజి పిల్లా
ఇంత మొండిగుంటే ఎల్లా

Oh yeah oh yeah
Oh ye oh ye oh ye

సైకో…. సైకో…
నువ్వు ఓ పెద్ద సైకో

సైకో… సైకో…

నువ్వు ఓ ముదురు సైకో

(Rap Part)

లెట్స్ బి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్
అని నువ్వే అంటావ్

బెటర్ మ్యారీ సంవన్ ఎల్స్
బాయ్ సెలవు అంటావ్

పేరెంట్స్ చూపించిన అమ్మాయికి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయ్ మంటావ్

తీరా షాదీ గీదీ అయ్యాకేమో
ఆమెను వదిలేయ్ మంటావ్

సైకో... సైకో...

పిచ్చి పిచ్చి పిల్లా
నీతో ఏగేది ఎల్లా

క్రేజి క్రేజి పిల్లా
ఇంత మొండిగుంటే ఎల్లా

Oh yeah oh yeah
Oh ye oh ye oh ye

సైకో…. సైకో…
నువ్వు ఓ పెద్ద సైకో

సైకో… సైకో…
నువ్వు ఓ ముదురు సైకో

ఏదో ఏదో కావాలందీ...





ఏదో ఏదో కావాలందీ
నా మనసు

తప్పో ఒప్పో చేసేయ్మందీ
ఈ వయసు

హద్దు పొద్దు దాటేయ్మందీ
నా తనసు

అన్నీ నీకే ఇచ్చేయ్మందీ 
ఈ సొగసు

ఏదో ఏదో కావాలందీ
నా మనసు

తప్పో ఒప్పో చేసేయ్మందీ
ఈ వయసు

ముద్దులతో ముంచేత్తమందీ
నా మనసు

కౌగిలిలో బందిన్చేయ్మందీ
ఈ వయసు

రేయి పగలు జాగారం చేయ్యమందీ
నా తనసు

రెండు తనువులు ఒకటవ్మందీ
ఈ సొగసు

ఏదో ఏదో కావాలందీ
నా మనసు

తప్పో ఒప్పో చేసేయ్మందీ
ఈ వయసు

Monday, June 21, 2010

సరసం...



నీ తడిసీ తడవని అందం
నాలో కలిగించెను కొత్త వాంచ

నీ అందీ అందని అందం
చేసుకోమన్నది నిన్ను నా స్వంతం

నీ సోయగానాలు నే తిలకించనా
నీ కురులను నే సవరించనా

పెదవిని పెదవితో బంధించనా
తనువును తనువుతో పెనవేయనా

నీ కౌగిలిలో కరిగి మత్తెక్కించనా
నీ శృంగారములను నే చవి చూడనా

నీ తనువెల్ల ముద్దులతో మురిపించనా
నా సరసంతో స్వర్గాన్ని చూపించనా...

పయనం...



జననం మరణం
తప్పదు ఇది విధి నిర్మాణం

అప్పుడే నిండాయా
నా వందేళ్ళ ఈ జీవితం

ఎదురీతిక ఎందుకు
ఒడ్డున చేరింది నా పయనం

చిరునవ్వుతో స్వాగతిస్తాను
ఏదైనా ఇది నా నిర్ణయం

వుండే చిరు కాలం
మీ గుండెల్లో మిగిలి పోవాలి చిరకాలం...

Wednesday, June 2, 2010

నీ నవ్వుల హరివిల్లు...




నీ నవ్వుల హరివిల్లు
కురిపించెను చిరు జల్లు

నీ పెదవుల సరిగమలు
తిలకించెను నా కళ్ళు

నీ నల్లని కురులు
మెరిసే మేఘమల్లె త్రుళ్ళు

నీ నడకలోని హొయలు
దోచెను అందరి మనసులు

నీ రసరమ్య గానాలు
స్పృసించెను నా చెవులు

నీ సిరిమువ్వల ఘల్లు
తెరిపించెను గుండె గళ్ళు

నీ పరువపు పరవళ్ళు
కవ్వించెను నా వొళ్ళు

Wednesday, May 19, 2010

సాక్షిగా...



మెరిసే మేఘం సాక్షిగా
కురిసే వర్షం సాక్షిగా

ఎగిరే పావురం సాక్షిగా
వీచే గాలి సాక్షిగా

పొంగే అలల సాక్షిగా
పూచే పూల సాక్షిగా

ఒణికే పెదవుల సాక్షిగా
తడిసే అందాల సాక్షిగా

రేయి పగలు సాక్షిగా
జననం మరణం సాక్షిగా

పంచభూతాల సాక్షిగా
నిన్నే ప్రీమించా, మన ప్రేమ సాక్షిగా...

Saturday, April 3, 2010

నా ముద్దు గుమ్మ…




ఇంటీ ముందు ముగ్గు పెట్టు
ముగ్గులొన దించినట్టు

బుగ్గ పై ముద్దు పెట్టు
ముద్దు మీద ముద్దు పెట్టు

రావే రావే నా ముద్దు గుమ్మ… మన ప్రేమ మీదొట్టు

నా మనసే నాలొ లేనట్టు
నీ చుట్టూనే తిరుగుతున్నట్టు

ఊహించుకొ నేను నీ ముందున్నట్టు
పున్నమి రోజు వెన్నెల జలువరుతున్నట్టు

రావే రావే నా ముద్దు గుమ్మ… మన ప్రేమ మీదొట్టు

ఓర కన్నుతొ నన్ను దొచినట్టు
నీ వొంపు సొంపులతొ చంపినట్టు

తనువు తనువు తాకినట్టు
సరసం విరహం తొడైనట్టు

రావే రావే నా ముద్దు గుమ్మ… మన ప్రేమ మీదొట్టు

అందని అందమె అందినట్టు
నీకొసమె నేను పుట్టినట్టు

నే వుంట నువ్వు కొరినట్టు
నన్ను కాదంటే నేను చచ్చినంతొట్టు

రావే రావే నా ముద్దు గుమ్మ… మన ప్రేమ మీదొట్టు

Saturday, January 23, 2010

ఓ వయ్యారి...



తెల్ల వారి జామున
తెల్ల తెల్ల చీరతో

అందాన్ని వెదజల్లుతున్న ఓ వయ్యారి
నిదుర లేపేను నన్ను చిరు నవ్వుతో

మెరిసే ఆమె కళ్ళు
మత్తేక్కించెను నన్ను

ఒనికే ఆమె లేత పెదవి
సరిగమలను పలికెను

కురులను హత్తుకున్న సన్న జాజులు
ఆమెను హత్తుకోమని సైగలు చేసెను

కళ్ళు తెరిచి చూడగా
ఒక తీయటి కలగా మిగిలి పోయెను...

Thursday, December 24, 2009

వీడ్కోలు




ఎగిరి ఎగిరి పోయెను ప్రేమ

మనసులోన దాగిన ప్రేమ


కడ సారి వీడ్కోలు పలుకనా...


అతని మీద వున్న ప్రేమ

వొదిగి వొదిగి పోయెను ప్రేమ


కడ సారి వీడ్కోలు పలుకనా...


ప్రేమకర్తం తెలియని మనిషితో

ఏడడుగులు నడిచిన దాన్ని


కడ సారి వీడ్కోలు పలుకనా...


ఆడదంటే అలుసనె మనిషితో

జీవితం పంచుకున్న దాన్ని


కడ సారి వీడ్కోలు పలుకనా...

Sunday, November 22, 2009

తొలి ప్రేమ...



ఏదో అలజడి,
తొలి ప్రేమో ఏమో మరి...

తోడై నీవుంటే,
స్వర్గం కాదా జీవితం...

నా సరసన నువ్వుంటే,
ఇక జయమే నా వెంటే...

ప్రణయం విరహం తో,
చేరాను నీ కౌగిలి...

ముద్దులు పొద్దులకు,
ఇక హద్దే లేదని...

నువ్వు నేనని,
ఇక గొడవే లేదని...

రాగం తాళం లా,
కలిసి పోదాం ఇరువురం...

ఆమె చూపులే,
నన్ను దోచెను నిలువునే...

Friday, November 20, 2009

నేస్తం




ఎటు వైపు ఈ పయనం
తెలియక ఏ గమ్యం

ఓదార్చే మనిషిక లేడు
ప్రేమించే ప్రియుడిక లేడు

తోడెవరో తెలియక
పయనిస్తూ వుండగా

దారి చూపే దైవంలా
నిలిచావు నీవు నాకు అండగా

కడవరకు వుండాలి నీ అండ నేస్తం
కను మూసినా, మన స్నేహం నిలవాలి చిరకాలం ...

Monday, November 2, 2009

తొలి రాత్రి



మధురాతి మధురం - మన ఈ తొలి రాత్రి
ప్రతి రేయి కావాలి - మన తొలి రాత్రి

నీ లేత పెదవులకు - నేనిచ్చిన చుంబనం
నీ కౌగిలిలో - నే కరిగిన అనుభవం

నీ కురులలోని - సన్న జాజి నేనవ్వనా
ఆ పరిమళాన్ని - గది మొత్తం వెద జల్లనా

నీ చేతి గాజులై - నిన్ను నే అలరించనా
నీ కాలి మువ్వలై - నిన్ను నే మురిపించనా

నీ చీర కుచ్చిళ్ళు - నే నవ్వనా
నీ జఘనము మునివేళ్ళతొ - నే స్పృసించనా

నీ వొంపు సొంపులను - నే కవ్వించనా
నీ అధరాల మధురాన్ని - నే ఆస్వాదించనా

ఏదో తెలియని - కొత్త అనుభవం
నీ జత కోరెను - అనుక్షణం

జన్మ జన్మలకు - మరువలేని రాత్రి
మధురాతి మధురమైన - మన ఈ తొలి రాత్రి ...

Wednesday, September 30, 2009

తోలి సారి నిను చూసి...



తోలి సారి నిను చూసి - నే మై మరిచా
ప్రతి రేయి ఊహలలో - నిన్నే తలిచా

రేయి పగలు – నీ అడుగులో అడుగై
అనుక్షణం - నీ వెంటే నడిచా

వెచ్చని కౌగిలిలో – నే కర్పూరం లా
కరుగుతూ - నీ బంధినై నిలిచా

దేహం రెండైనా – ప్రాణం ఒకటే లా
ప్రతి నిత్యం – నే నిన్నే ప్రేమించా

తోలి సారి నిను చూసి - నే మై మరిచా
ప్రతి రేయి ఊహలలో - నిన్నే తలిచా

Wednesday, August 5, 2009

ఓ బాటసారి...



తనువొక చోట మనుసోక చోట
కలిసీ కలవని ఇరువురి బాట ...

ఒకరికి ఒకరం అనుకున్న చోట
ఊహకు అందని సంఘటన ఎదురైంది ఈ పూట...

అతను ఆమె ప్రేమ మత్తులో మునిగి తేలుతూ
జ్వాలాజ్ఞిని నాపై వెధజల్లుతూ...

అనంత దూరాలకు పయనం చేస్తూ
నా జీవితం ఎడారి చేసి వెళ్ళిపోయాడు ఈ పూట...

Sunday, July 19, 2009

ఈ వేళ...





ఇరువురి చూపులు కలిసిన వేళ,
మనసు మనసు ఒకటైన వేళ,

ఒకరికి ఒకరం అనుకున్న వేళ,
తనువు తనువు తాకిన వేళ,

పెదవి పెదవి ఒణికిన వేళ,
వెచ్చని కౌగిలిలో కరిగిన వేళ,

రేయి పగలు తెలియని వేళ,
ప్రేమ మత్తులో మునిగిన వేళ,

నా సరసన నువ్వున్న వేళ,
స్వర్గం ఇక ఎందుకు అనిపించింది ఈ వేళ.

Friday, July 17, 2009

సొగసు చూడ తరమా…



సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

రమ్మని, కమ్మని… ముద్దునె, ఇవ్వని…
పెదవులే, తపనతొ… పలికెను, సరిగమ…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

వెచ్చని, కౌగిలి… వేచెను, ఫ్రియతమా...
తెలియని, అనుభవం…ముంగిట, ఉందని…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

ఒంటరి, జీవితం… చాలిక, ప్రణయమా…
అందని, అందమె…అందుకో, నేస్తమా…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

Friday, May 15, 2009

మనసా ఎందుకే…




మనసా ఎందుకే… తుళ్ళి పడకే…
ఎంత ఎగసి పడినా.... మిగిలేది చిరు జ్ఞాపకాలే

స్నేహం తొ మొదలైంది … మన కలయిక ప్రియతమ...
ఆగేది కాదు ఇది... ఎన్ని జన్మలైనా మధురిమ...

మరొ జన్మ అంటు వుంటే… నీతొనే సుమా….
ప్రతి జన్మకు... నీవే నా నేస్తం ప్రణయమా...

ప్రాయం ఆగదు… ప్రాణం విడువదు…
ఏదొ అలజడి… నాకే తెలియదు…

నిన్ను మరువలేక… దూరం వెళ్ళలేక…
విరహం తొ వేగుతూ… వున్నా ప్రియతమ…

మన కలయిక… ఒక తీయటి అనుభవం…
నేను రాసే ప్రతి అక్షరం… నీకే అంకితం…

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!