ఎచటకు వెళ్ళావు నీవు నన్ను ఇచట వదిలి
మనసు రగులుతోంది విరహంతో తుళ్ళి తుళ్ళి
నీకొసం నేనున్నా వేచి వేచి ప్రియతమా
నీ రాకకై నేనున్నా ఎదురుచూస్తూ ప్రణయమా
నీ తలపులతో, విరహపు వేదనతో
స్వప్న లోకంలో, నేవిహరిస్తున్నా
వీచే ప్రతి చల్ల గాలీ నీ కవ్వింతని గుర్తిస్తుంది
నువ్వు లేని ఈ జీవితం
ఎడారిలా అనిపిస్తుంది
నిన్ను వీడి ఇక నేనుండలేను
నీ స్మృతులను నేమరువలేను
ఈ ఎడబాటులో మన చిలిపి జ్ఞాపకాలతో
పాడాను నేను ఒక మౌనరాగం...
మనసు రగులుతోంది విరహంతో తుళ్ళి తుళ్ళి
నీకొసం నేనున్నా వేచి వేచి ప్రియతమా
నీ రాకకై నేనున్నా ఎదురుచూస్తూ ప్రణయమా
నీ తలపులతో, విరహపు వేదనతో
స్వప్న లోకంలో, నేవిహరిస్తున్నా
వీచే ప్రతి చల్ల గాలీ నీ కవ్వింతని గుర్తిస్తుంది
నువ్వు లేని ఈ జీవితం
ఎడారిలా అనిపిస్తుంది
నిన్ను వీడి ఇక నేనుండలేను
నీ స్మృతులను నేమరువలేను
ఈ ఎడబాటులో మన చిలిపి జ్ఞాపకాలతో
పాడాను నేను ఒక మౌనరాగం...