నీ దరి చేరటానికి ఎంత ప్రయత్నించినా,
నేను నీకు అంతే దూరం అవుతున్నా.
నిను వీడి దూరం వెళ్లటానికి ఎంత ప్రయత్నించినా,
నేను నీకు అంతే చేరువవుతున్నా.
నీపై నాకున్నది నిజమైన ప్రేమ,
కానీ నీకు నాపై వున్నది కేవలం జాలి.
నువ్వు ఎటు వెళ్ళినా నీ నీడై నేనుంటా,
నువ్వు ఏంచేసినా నీ తోడై నేనుంటా.
ఓ ప్రియతమా!
నేనెప్పుడూ నీదానినే .... నువ్వెప్పుడూ నావాడివే...
ఎప్పుడూ.... ఎల్లప్పుడూ.....