Valentine

Monday, October 20, 2008

ప్రవల్లిక




ప్రవల్లికనై వచ్చాను నే నీ జీవితంలొ
ప్రశ్నలా మిగిలి పోయాను నే నీ జీవితంలొ

నిరాశలో వున్నపుడు ఆశనై నేను
కష్టాల్లో వున్నపుడు స్ఫూర్తినై నేను

బాధలొ వున్నపుడు స్నేహితురాలై నేను
ప్రేమలో వున్నపుడు ప్రియురాలై నేను

చీకటిలొ వున్నపుడు వెలుగై నేను
ఒంటరిగా వున్నపుడు తోడునై నేను

మరువలేని జ్ఞాపకాలు మిగిల్చాను నీకు
మరలిరాని అనుభూతులు నింపాను నేను

ఎల్లపుడు నీ వెంటే నేనుంటాను నేస్తం
నీవు లేని జీవితం నాకెంతో కష్టం...

4 comments:

Sky said...

ప్రవల్లిక గారికి,
చాలా ఆనందంగా వుంది. అడగగానే తెలుగులో కూడా కవిత్వం వ్రాయటం మొదలుపెట్టినందుకు... మొదటి ప్రయత్నంలోనే చాల అందంగా మీ భావాలను అక్షరీకరించారు. మీ ఇతర భాషా సాహిత్యం లానే తెలుగుకు కూడా ప్రాధాన్యతని ఇచ్చి ఇకపై ఈ కవితా వాహినిని కొనసాగిస్తారని ఆశిస్తూ, మనస్పూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ.....

భవదీయుడు,
సతీష్ యనమండ్ర

Pravallika said...

Hi SKY,

Thank you so much. I would have not written in telugu if you would have not inspired me.

Thanks again.

Best Regards,
Pravallika

suresh said...

hey thnq u yar
nice poems gud keppitup
and
this is my blog

www.orkut547.blogspot.com
see once

Pravallika said...

Hello Suresh garu,

Thank you soo much...

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!