Valentine

Monday, March 23, 2009

తను లేని క్షణాలు…




నన్ను వీడి నీవు వెళ్ళినపుడు
ఒంటరితనం నాకు తోడై ఉంటుంది

నేను నీ జ్ఞాపకాలను ఎంత మరువటానికి ప్రయత్నించినా
ఈ ఒంటరితనం నిన్ను గుర్తిస్తూనే వుంటుంది

మంచం మీద వున్న ఆ దుప్పటి మీదొట్టు
పెదాలను తాకుతున్న ఈ మధువు మీదొట్టు

రాతిరంత వెలుగుతున్న ఈ దీపాల మీదొట్టు
రేయి పగలు సువాసనను వెధజల్లుతున్న ఈ పూల మీదొట్టు

విరిగిన ఈ గాజుల మీదొట్టు
చెరిగిన ఈ బొట్టు మీదొట్టు

మువ్వల ఈ సవ్వడి మీదొట్టు
మన ప్రేమకు సాక్షిగా ఉన్న ఈ గది మీదొట్టు

నీతో గడిపిన ఆ మధురమైన క్షణాలు
నా కనులకు కట్టినట్టు కనిపిస్తుంది

నీవు చెప్పిన ఆ తీయటి మాటలు
మురళీగానంలా ఇంకా నా చెవిలొ మ్రొగుతూనే ఉంది

మన ఎడబాటును ఇక నే భరించలేకున్నా
మన ఆ మధురమైన క్షణాలను ఇక నే మరువలేకున్నా

నీకోసమే నిరీక్షిస్తున్నా
నీవు వస్తావని వేయి కళ్ళతొ ఎదురుచూస్తున్నా…

4 comments:

raki said...

"తను లేని క్షణాలు…" was very gud!

Pravallika said...

Hi Raki,

Thank you soo much...

naga said...

akka realy super

Pravallika said...

Hi Tammi,

Thank you soo much....


Best Regards,
Pravallika

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!